TPCC President: రేవంత్ స‌మ‌క్షంలోనే వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో రెండు వ‌ర్గాల త‌న్నులాట‌

clash in congress groups in warangal infront of revanth reddy
  • మే 6న వ‌రంగ‌ల్‌కు రానున్న రాహుల్ 
  • బ‌హిరంగ స‌భా వేదిక పరిశీలనకు వచ్చిన రేవంత్ 
  • రేవంత్ ముందే జంగా, నాయిని వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ పోరు పార్టీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలోనే పార్టీకి చెందిన వ‌రంగ‌ల్ శాఖ నేత‌ల మ‌ధ్య గ‌లాటా చోటుచేసుకుంది. పార్టీకి చెందిన జంగా, నాయిని వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఇరు వ‌ర్గాల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు రేవంత్ రెడ్డి ముందే ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగారు.

వ‌చ్చే నెల 6న వ‌రంగ‌ల్‌కు రాహుల్ గాంధీ రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ పాల్గొనే బ‌హిరంగ స‌భా వేదిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగ‌ణాన్ని పార్టీ కీల‌క నేత‌ల‌తో క‌లిసి రేవంత్ రెడ్డి  గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జంగా, నాయినిల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకోగా... ఇరు వ‌ర్గాల‌కు చెంది‌న కార్య‌క‌ర్త‌లు త‌న్నుకున్నారు.
TPCC President
Warangal
Congress
Rahul Gandhi
Revanth Reddy

More Telugu News