Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై నితిన్ గడ్కరీ సీరియస్.. కంపెనీలకు వార్నింగ్
- వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోయిన పలువురు వ్యక్తులు
- లోపాలున్న వాహనాలను రీకాల్ చేయాలన్న గడ్కరీ
- విచారణ అనంతరం ఆయా కంపెనీలపై చర్యలు తప్పవంటూ వార్నింగ్
ఇటీవలి కాలంలో పలు ఎలక్ట్రిక్ టూ వీలర్లు విద్యుత్ షాక్‌కు గురై ఆహుతైన సంఘటనలను మనం చూస్తున్నాం. ఆయా ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రమాదాలపై దృష్టి సారించారు. ప్రమాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఆయా వాహనాల కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
లోపాలున్న వాహనాలను తక్షణమే రీకాల్ చేయాలని ఆయా కంపెనీలకు గడ్కరీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా చోటుచేసుకున్న ప్రమాదాలపై విచారణ జరిపి.. కంపెనీ తప్పిదాలపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.