AB Venkateswara Rao: ఏబీ వెంక‌టేశ్వ‌రరావు సస్పెన్ష‌న్ ర‌ద్దు.. సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

supreme court candels sujspension on ips officer ab venkateswara rao

  • నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో ఏబీపై ఆరోప‌ణ‌లు
  • వైసీపీ అధికారంలోకి రాగానే స‌స్పెన్ష‌న్ వేటు
  • రెండేళ్లు మించిపోయినా ఎత్తివేయ‌ని స‌స్పెన్ష‌న్‌
  • సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఏబీ  
  • త‌క్ష‌ణ‌మే ఏబీని స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు భారీ ఊర‌ట ల‌భించింది. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఆయనను త‌క్ష‌ణ‌మే విధుల్లోకి తీసుకోవాలంటూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం శుక్ర‌వారం ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొన‌సాగుతున్న స‌స్నెన్ష‌న్‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది.

టీడీపీ హ‌యాంలో ఇంటెలిజెన్స్ డీజీగా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు నిఘా ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించి రెండేళ్లు అవుతున్నా...ఇంకా ఎత్తివేయ‌లేద‌ని, త‌న‌ను స‌ర్వీసులోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. 

కేసు విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై విధించిన‌ స‌స్సెన్ష‌న్‌ను ఎత్తివేయ‌లేమ‌ని ఏపీ ప్ర‌భుత్వం స్సెష‌ల్ లీవ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ వ్య‌వ‌హారంపై ఇంతకుముందే విచార‌ణ‌ను పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం తీర్పు వెలువ‌రించిన సుప్రీంకోర్టు... ఐపీఎస్ అధికారుల‌పై రెండేళ్ల‌కు మించి స‌స్పెన్ష‌న్ విధించ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే ఏబీపై స‌స్పెన్ష‌న్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌క్ష‌ణ‌మే ఆయనను స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News