Investigation Officer: 'సీఎం కాన్వాయ్ కి ప్రైవేటు కారు' ఘటనలో దర్యాప్తు అధికారి నియామకం
- తిరుమల వెళుతున్న భక్తులు
- ఒంగోలులో భక్తుల నుంచి కారు తీసుకున్న అధికారులు
- సీఎం కాన్వాయ్ కి కారు అవసరమైందని వివరణ
- ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం
తిరుమల వెళుతున్న భక్తులను ఒంగోలులో ఆపేసిన రవాణాశాఖ అధికారులు, సీఎం కాన్వాయ్ కి కారు కావాలంటూ ఆ భక్తుల కారును తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా ఈ ఉదంతంపై దర్యాప్తు అధికారిని నియమించింది. దర్యాప్తు అధికారిగా ఒంగోలు ఆర్డీవోను నియమించింది. కాగా, ఈ ఘటనపై విచారణలో భాగంగా కారు డ్రైవర్ కు, యజమానికి, భక్తులకు, ఆర్టీవో సిబ్బందికి విడివిడిగా నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలు ఆర్డీవో కార్యాలయానికి రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.