Navneet Kaur Rana: ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట శివసేన కార్యకర్తల ఆందోళన... తగ్గేదే లేదన్న మాజీ నటి

Shivsena workers protests outside MP Navneet Kaur Rana residence
  • మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం
  • హనుమాన్ జయంతి రోజున సీఎం చాలీసా పఠించాలన్న నవనీత్
  • లేదంటే ఆయన నివాసం వద్ద తామే పఠిస్తామని వ్యాఖ్య 
  • నవనీత్ ఇంటిని ముట్టడించిన శివసేన కార్యకర్తలు
హనుమాన్ జయంతి నాడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాల్సిందేనని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా (ఎమ్మెల్యే) ప్రకటన చేయడం తెలిసిందే. ఇప్పుడు వారిద్దరికీ శివసేన సెగ తగులుతోంది. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ నివాసం ఎదుట శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడి ఆందోళనకు దిగారు. నవనీత్, ఆమె భర్తకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. 

దీనిపై నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నివాసం వద్ద దౌర్జన్యం చేయాలంటూ శివసేన కార్యకర్తలను ముఖ్యమంత్రే ఆదేశించారని ఆరోపించారు. వారు బ్యారికేడ్లను సైతం తోసివేస్తూ ముందుకు వస్తున్నారని వివరించారు. తాను మరోసారి చెబుతున్నానని, థాకరేల నివాసం మాతోశ్రీ వద్దకు వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి తీరుతానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా జైల్లోకి నెట్టాలన్నది మాత్రమే తెలుసని విమర్శించారు.
Navneet Kaur Rana
Shivsena
Uddhav Thackeray
Hanuman Chalisa
Maharashtra

More Telugu News