Chiranjeevi: ఇరుకునపెట్టే ప్రశ్నలడిగిన సుమ.. అంతే చాకచక్యంగా సమాధానాలిచ్చిన చిరూ, చరణ్.. ఇదిగో వీడియో

Suma Asks Chiru and Charan Interesting Answers Here Their Answers
  • అమ్మ చేతి వంటే బెస్ట్ అన్న చిరంజీవి
  • శివుడి తర్వాతే ఎవరైనా
  • ఆయన ముందు చేసిన దాన్నే డ్యాన్స్ అనుకుంటారు
  • తన పేరు శివశంకరవర ప్రసాద్ అంటూ చిరూ కామెంట్
ఆచార్య.. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అంతకన్నా ముందు నిన్న ‘ప్రీ రిలీజ్’ కార్యక్రమంలో అభిమానులను పలకరించాడు. ఆచార్యతో పాటు సిద్ధ కూడా హాయ్ చెప్పాడు. వారిని యాంకర్ సుమ.. ఆసక్తికర ప్రశ్నలను సంధించి ఇరుకున పడేసింది. వాళ్లూ అంతే చాకచక్యంతో సరదా సమాధానాలిచ్చి నవ్వులు పూయించారు. 

సుమ: మీ అమ్మగారి చేతి వంట బాగుంటుందా? లేదా మీ సతీమణి సురేఖ చేతి వంటా?
చిరంజీవి: అమ్మ చేతి వంటే. అమ్మ ప్రేమ, అమ్మ చేతి వంట.. గుండెలకు హత్తుకుని ఆమె చూపించే ప్రేమాభిమానానికి మించిన కమ్మదనం మరేదైనా ఉంటుందా!

సుమ: చిరంజీవి, చరణ్ వీళ్లిద్దరిలో ఎవరు మంచి డ్యాన్సర్?
చరణ్: చిరంజీవి.
చిరంజీవి: గుర్తుందిగా నా పేరు శివశంకర వరప్రసాద్. శివుడు నృత్యానికి ప్రసిద్ధి. ఆయన ముందు ఎంతో మంది డ్యాన్స్ లు చేస్తారు. అదే డ్యాన్స్ అనుకుంటారు. ఎవరైనా శివుడి తర్వాతే.. ఆయన తాండవం తర్వాతే.

సుమ: చిరంజీవి లేదా పవన్ కల్యాణ్.. వాళ్లలో ఎవరు మీకు ఆచార్య?
చరణ్: ఈ ప్రశ్న అడగమన్న వారిని ఒక్కసారి ఇటు రమ్మనండి. సమాధానం చాలా కష్టం. ఆచార్యుల నుంచి వాతలు పడతాయి. కాబట్టి చెప్పను. 
చిరంజీవి: నేను చెబుతాను. నా నుంచి క్రమశిక్షణ, వాళ్ల బాబాయ్ ను చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు.

సుమ: ఉపాసన లేదా నాన్న.. వారిద్దరిలో చరణ్ ఎక్కువగా భయపడేది ఎవరికి?
చరణ్: ఇంట్లో వాళ్లందరికీ అమ్మే బాస్. అమ్మ ముందు నాన్న చాలా జాగ్రత్తగా ఉంటారు. నాన్నను చూసి నేనూ నేర్చుకున్నా. ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. 
చిరంజీవి: నన్ను చూసి నేర్చుకున్నావా! అయితే సుఖ పడతావ్. వాళ్లతో అస్సలు పెట్టుకోవద్దు. 


Chiranjeevi
Ramcharan
Acharya
Koratala Siva
Suma
Tollywood

More Telugu News