Andhra Pradesh: ఏపీలో మే 20 వరకు ఉపాధ్యాయులకు సెలవులు లేవు!
- ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- మే 6 నుంచి జులై 3 వరకు పాఠశాలలకు సెలవులు
- మే 20 తర్వాతే టీచర్లకు అందుబాటులోకి సెలవులు
- తాజా ఉత్తర్వులు జారీ
ఏపీలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటించడం తెలిసిందే. అయితే, ఉపాధ్యాయులకు సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 20వ తేదీ వరకు ఉపాధ్యాయుల సెలవులను రద్దు చేసింది. కేవలం అత్యవసర వైద్య చికిత్సలకు మాత్రమే సెలవులు మంజూరు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20వ తేదీ తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి వస్తాయి. జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం షురూ కానుంది.