NTR District: ప‌గ‌లు ఆరోప‌ణ‌లు, రాత్రి ఫోన్ చేసే బాప‌తు కాదు... దేవినేనికి వ‌సంత కృష్ణప్రసాద్ ఘాటు రిప్లై

ysrcp mla vasantha krishna prasad counters to devineni uma
  • వ‌సంత అవినీతికి పాల్ప‌డ్డార‌న్న దేవినేని
  • అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని చెప్పిన వ‌సంత‌
  • ప్ర‌మాణానికి తాను సిద్ధ‌మ‌న్న ఎమ్మెల్యే
  • ల‌గ‌డ‌పాటి త‌న‌కు చిర‌కాల మిత్రుడ‌ని వెల్ల‌డి
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్‌, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఎమ్మెల్యే హోదాలో వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని దేవినేని చేసిన ఆరోప‌ణ‌ల‌కు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఘాటుగా స్పందించారు. ప‌గ‌లు ఆరోప‌ణ‌లు గుప్పించి...రాత్రికి ఫోన్‌చేసే బాప‌తు తాను కాదంటూ దేవినేనికి ఆయ‌న ఘాటు రిప్లై ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా దేవినేనికి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఓ స‌వాల్ కూడా విసిరారు. తాను అవినీతికి పాల్ప‌డ‌లేద‌న్న వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌... ఆ మేర‌కు తాను ప్ర‌మాణం చేసేందుకు సిద్ధ‌మ‌ని తెలిపారు. మ‌రి ప్ర‌మాణానికి దేవినేని కూడా సిద్ధ‌మేనా? అని ఆయ‌న స‌వాల్ విసిరారు. లగ‌డ‌పాటి రాజ‌గోపాల్‌తో త‌న భేటీపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న దానిపైనా ఎమ్మెల్యే స్పందించారు. ల‌గ‌డ‌పాటి త‌న‌కు చిర‌కాల మిత్రుడ‌ని తెలిపిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌... ఆయ‌న‌తో భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని తేల్చేశారు.
NTR District
Mylavaram
YSRCP
Vasantha Krishna Prasad
Devineni Uma

More Telugu News