Hyderabad: టీఆర్ఎస్ ప్లీన‌రీ నేపథ్యంలో.. రేపు సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

traffic restrictions in hyd

  • రేపు హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీన‌రీ
  • ట్రాఫిక్ ర‌ద్దీగా ఉండే ఛాన్స్‌
  • ప‌లు ప్రాంతాల మీదుగా ట్రాఫిక్ మ‌ళ్లింపులు

టీఆర్ఎస్ ప్లీన‌రీకి అన్ని ఏర్పాట్లు పూర్త‌వుతున్నాయి. హైద‌రాబాద్ వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గులాబీ పోస్ట‌ర్లు, క‌టౌట్ల‌ను ఏర్పాటు చేశారు. రేపు ప్లీన‌రీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. 

ప్లీన‌రీ జ‌ర‌గ‌నున్న‌ హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌తో పాటు సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని ఆఫీసుల‌ నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచ‌న‌లు చేశారు. 

రేపు ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు; అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు. నీరూస్‌ జంక్షన్‌-సైబర్‌ టవర్స్‌, జంక్షన్‌-మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-గూగుల్‌ (సీఐఐ) జంక్షన్‌-కొత్తగూడ జంక్షన్‌ రోడ్డులో ట్రాఫిక్ ర‌ద్దీ అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-ఖానామెట్‌ జంక్షన్‌-హైటెక్స్‌/హెఐసీసీ/ఎన్‌ఏసీ రోడ్డు వ‌ద్ద కూడా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. 

జేఎన్‌టీయూ-సైబర్‌ టవర్స్‌-బయో డైవర్సిటీ జంక్షన్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. గచ్చిబౌలి జంక్షన్‌-బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌- కొత్తగూడ జంక్షన్‌-కొండాపూర్‌ జంక్షన్ల వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాలుగా నీరూస్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లే వారు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ నుంచి దుర్గం చెరువు, ఇనార్బిట్‌-ఐటీసీ కోహినూర్‌-ఐకియా-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి మీదుగా సైబర్‌ టవర్స్‌ వైపునకు వెళ్ల‌కూడ‌దు. 

మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ ప్రాంతాలనుంచి వచ్చే వాహ‌నాలు అలాగే, హైటెక్‌ సిటీ-సైబర్‌ టవర్స్‌-జూబ్లీహిల్స్‌ వచ్చే వాహనాలు రోల్లింగ్‌ హిల్స్‌ ఏఐజీ ఆసుప‌త్రి-ఐకియా-ఇనార్బిట్‌-దుర్గం చెరువు రోడ్డు మీదుగా దారి మ‌ళ్లించి వెళ్లాలి. అలాగే, ఆర్‌సీపురం, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌-నల్లగండ్ల-హెచ్‌సీయూ-ట్రిపుల్‌ ఐటీ-గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్‌, ఆల్విన్‌ రోడ్డు వైపునకు వెళ్లకుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News