rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం
- రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
- గ్రేటర్ హైదరాబాద్‌లో వాతావరణం మళ్లీ వేడెక్కిన వైనం
- గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొడిగాలులు
హైదరాబాద్ పై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, రానున్న 48 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్‌లో వాతావరణం రెండు రోజులుగా మళ్లీ వేడెక్కింది.
గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గాలిలో తేమ 25 శాతంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.