Menu: టీఆర్ఎస్ ప్లీనరీలో నోరూరించే వంటకాలు... మెనూ ఇదిగో!

More tastes for TRS Plenary delegates
  • హైదరాబాదులో టీఆర్ఎస్ ప్లీనరీ
  • 6 వేల మంది వస్తారని అంచనా
  • హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు
  • 30కి పైగా వంటకాలతో మెనూ 
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరీ సమావేశం రేపు హైదరాబాదులో జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీ హైటెక్స్ లో జరగనున్న ప్లీనరీకి దాదాపు 6 వేల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరవుతారని అంచనా. వారి కోసం నోరూరించే వంటకాలతో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 30కి పైగా మాంసాహార, శాకాహార వంటకాలు, స్నాక్స్ తో మెనూ సిద్ధమైంది. మెనూలో ప్రధానంగా తెలంగాణ రుచులు వండి వార్చనున్నారు. అంతేకాదు, ఇతర ప్రాంతాల వంటకాలకు కూడా ఈ మెనూలో చోటిచ్చారు.

టీఆర్ఎస్ ప్లీనరీ వంటకాల జాబితా

1. చికెన్ ధమ్ బిర్యానీ 
2. బగారా రైస్
3. వైట్ రైస్
4. తెలంగాణ నాటు కోడి కూర 
5. మటన్ కర్రీ
6. తలకాయ కూర
7. బోటీ దాల్చా
8. ధమ్ కా చికెన్
9. రుమాలీ రోటీ
10. కోడిగుడ్డు పులుసు
11. మిక్సడ్ వెజిటబుల్ కుర్రా
12. మామిడికాయ పప్పు
13. గుత్తి వంకాయ కూర
14. టమాటా కర్రీ
15. పచ్చి పులుసు
16. పప్పు చారు-అప్పడం
17. ఉలవచారు
18. టమాటా రసం
19. దొండకాయ, కాజు ఫ్రై 
20. కొత్తిమీర తొక్కు
21. మామిడికాయ తొక్కు
22. వెల్లుల్లి కారం
23. చామగడ్డ పులుసు
24. ములక్కాడ పులుసు 
25. ఆనియన్ రైతా
26. మిర్చీ బజ్జీ
27. గులాబ్ జామూన్
28. డబుల్ కా మీఠా 
29. మిర్చీ గసాలు 
30. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్
31. పెరుగు
32. మజ్జిగ
33. ఫ్రూట్స్
34. అంబలి


Menu
Dishes
TRS Plenary
Hyderabad
Telangana

More Telugu News