TRS: రేపే టీఆర్ఎస్ ప్లీన‌రీ... జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్ తీర్మానం

kcr proposes 19 resolusions in trs plenary tomorrow
  • హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీన‌రీ
  • ఉద‌యం 11 గంల‌ల‌కు కేసీఆర్ ప్ర‌సంగం
  • 19 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టనున్న కేసీఆర్‌
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్లీన‌రీ రేపు జ‌ర‌గ‌నుంది. పార్టీ 21వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మాదాపూర్‌లోని హెచ్ఐసీపీలో పార్టీ ప్లీన‌రీని నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్లీన‌రీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్లీన‌రీలో భాగంగా పార్టీ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ ప‌లు కీల‌క తీర్మానాల‌ను ప్ర‌తిపాదించ‌నున్నారు. 

ప్లీన‌రీలో భాగంగా బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్న కేసీఆర్ మొత్తం 19 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. వీటిలో జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించిన తీర్మానాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర రాజ‌కీయాల‌తో పాటు జాతీయ రాజ‌కీయాల్లో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కేసీఆర్ ఈ తీర్మానాల‌ను ప్ర‌తిపాదించ‌నున్న‌ట్లు స‌మాచారం.
TRS
KCR
TRS Plenary

More Telugu News