Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
- మే 6 వరకు పరీక్షల నిర్వహణ
- ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు
- హాజరు కానున్న 6.22 లక్షల మంది విద్యార్ధులు
ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి మే నెల 6 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగని విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 7 పేపర్ల మేరకు మాత్రమే పరీక్షలు రాయనున్నారు.
ఇక ప్రతి రోజు పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.