Ratan tata: నా చివరి జీవితం ఆరోగ్యానికే అంకితం: రతన్ టాటా

I dedicate my last years to health Ratan tata

  • అసోంలో ఏడు కేన్సర్ ఆసుపత్రులకు ప్రారంభోత్సవం
  • ప్రధానితో కలిసి పాల్గొన్న రతన్ టాటా
  • కేన్సర్ చికిత్సలో అసోం ముందడుగు

నా జీవితం చరమాంకాన్ని ప్రజారోగ్యానికే అంకితం చేయనున్నట్టు ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా ప్రకటించారు. అసోం రాష్ట్రాన్ని అందరూ గుర్తించేలా చేయాలన్నారు. గురువారం ప్రధాని మోదీతో కలిసి అసోంలో ఏడు కేన్సర్ ఆసుపత్రులను రతన్ టాటా ప్రారంభించారు. అసోం కేన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మొత్తం 17 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. అసోం ప్రభుత్వం, టాటా ట్రస్ట్ ల జాయింట్ వెంచరే అసోం కేన్సర్ కేర్ ఫౌండేషన్. 

ఈ సందర్భంగా రతన్ టాటా తన ప్రసంగంతో మోదీ సహా అక్కడకు వచ్చిన వారు అందరినీ కట్టిపడేశారు. ‘‘నేడు అసోం రాష్ట్ర చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఆరోగ్య సంరక్షణ, కేన్సర్ చికిత్సా పరంగా అసోం రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన రోజు. కేన్సర్ ఎంత మాత్రం సంపన్నుల వ్యాధి కాదు. లక్షలాది మందికి చికిత్స చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి, ప్రధాని మద్దతు లేకుండా ఇవి జరిగేవి కావు’’అని రతన్ టాటా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News