Fruits: ఆస్తమా రోగులకు ఈ పండ్లు, కూరగాయలతో మేలు

Fruits and vegetables that reduce asthma symptoms
  • వాయునాళాల సంకోచంతో సమస్యలు
  • యాపిల్, దానిమ్మ, బీన్స్ తో మంచి ఫలితాలు
  • అల్లం, పాలకూర, టమాటాలతోనూ ఉపయోగాలు
దేశంలో ఆస్తమా రోగులు 3 కోట్లకు పైగా ఉంటారని అంచనా. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. పెరిగిపోయిన వాయు కాలుష్యం ఎక్కువ మందిని ఆస్తమా బారిన పడేస్తోంది. ఆస్తమా లక్షణాలతో బాధపడే వారు వాటి నుంచి ఉపశమనం కోసం రోజువారీ ఆహారంలో కొన్ని రకాల కూరగాయాలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

వాయు నాళాలు కుచించుకుపోవడం వల్ల ఏర్పడిన సమస్యే ఆస్తమా. వాపు కారణంగా వాయుమార్గాలు సన్నబడిపోవచ్చు. దాంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పర్యావరణ కాలుష్యానికి తోడు జన్యుపరమైన అంశాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే వైద్యులను తప్పకుండా సంప్రదించి చికిత్స పొందాలి. అదే సమయంలో పండ్లు, కూరగాయాలను తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం పొందొచ్చు.

క్యాప్సికం (బెల్ పెప్పర్)
ఇందులో విటమిన్ సీ, బెల్ పెప్సర్స్ ఉంటాయి. బెల్ పెప్సర్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోనూట్రియంట్ మంచి ఆరోగ్యానికి సాయపడతాయి.

దానిమ్మలు
పొమొగ్రనేట్ లో పీచు, విటమిన్ సీ, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో ఇవి కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తికి మేలు చేస్తాయి.

యాపిల్
పీచు, యాంటీ ఆక్సిడెంట్లు యాప్సిల్ లో సమృద్దిగా లభిస్తాయి. బరువు తగ్గడానికి, పేగుల ఆరోగ్యానికి మంచిది. మధుమేహం, గుండె వ్యాధులు, కేన్సర్ నివారణకు యాపిల్ సాయపడుతుంది.

గ్రీన్ బీన్స్
ఆకుపచ్చని బీన్స్ లో విటమిన్ ఏ, సీ, కే, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఆస్తమా లక్షణాలు తగ్గేందుకు సాయపడతాయి. ఎముకలు బలంగా ఉండడానికి, ఒత్తిళ్లు తగ్గడానికి ఇవి ఆహారంలో తీసుకోవచ్చు. 

అల్లం
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఒత్తిడి నివారణకు, డీఎన్ఏ దెబ్బతినకుండా ఉండేందుకు సాయపడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలతోపాటు అధిక రక్తపోటు, గుండె జబ్బులున్న వారికి అల్లంతో మంచి మేలు జరుగుతుంది. 

పాలకూర
ప్రొటీన్, ఐరన్, విటమిన్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కే, పీచు, పాస్ఫరస్, థయమిన్, విటమిన్ ఈ ఉన్నాయి. 

టొమాటో జ్యూస్
విటమిన్ సీ, బీ, పొటాషియం తగినంత టమాటాల్లో లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ కూడా ఇందులో ఉంటుంది. గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. ఆస్తమా లక్షణాలు తగ్గేందుకు కూడా సాయపడుతుంది.
Fruits
vegetables
help
asthma
control

More Telugu News