Andhra Pradesh: కేటీఆర్​.. రా.. వచ్చి కళ్లారా ఏపీ అభివృద్ధి గురించి తెలుసుకో.. ఏపీ మంత్రి జోగి రమేశ్​ ఫైర్​

Jogi Ramesh Fires On KTR Comments Over AP

  • ఏ సీఎం చేయని అభివృద్ధి జగన్ చేశారని కౌంటర్
  • ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందని కామెంట్
  • కేసీఆర్ లాగానే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని ఫైర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ విమర్శలు చేశారు. కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. 

దీనిపై స్పందించిన జోగి రమేశ్.. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నానంటూ చెప్పారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందన్నారు. 

‘‘ఏపీకి వస్తే అమ్మ ఒడి కనిపిస్తుంది. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుంది. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో సచివాలయం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుంది. సచివాలయ వ్యవస్థ బాగుందని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. అక్కడా సచివాలయ వ్యవస్థను పెడతామన్నారు. దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ లా అభివృద్ధి పనులను చేయాలనుకుంటున్నారు. మేం కేబినెట్ లోనూ సామాజిక న్యాయం పాటించాం. ఏపీలో జరిగినట్టు సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News