Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 460 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 142 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- ఆరున్నర శాతం నష్టపోయిన యాక్సిస్ బ్యాంక్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈ రోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. చివరి గంటన్నరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు నష్టపోయి 57,060కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 17,102కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.44%), సన్ ఫార్మా (0.94%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.87%), టాటా స్టీల్ (0.86%), డాక్టర్ రెడ్డీస్ (0.28%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-6.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.42%), విప్రో (-2.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.08%), మారుతి (-1.97%).