Radhe Shyam: ఓటీటీలో వచ్చేస్తున్న 'రాధే శ్యామ్' హిందీ వర్షన్... ఎప్పుడు, ఎందులో వస్తోందంటే..?
- ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో దక్షిణాది భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రాధే శ్యామ్'
- హిందీ వర్షన్ ను స్ట్రీమింగ్ చేయనున్న నెట్ ఫ్లిక్స్
- మే 4 నుంచి హిందీ వర్షన్ స్ట్రీమింగ్
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' ఓటీటీలో వచ్చేస్తోంది. ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం హిందీ వర్షన్ ను మే 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్ మ్యూజిక్ ను అందించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రొమాంటిక్ లవ్ డ్రామా అభిమానులను నిరుత్సాహ పరిచింది.
మరోవైపు ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వర్షన్ లు అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో కంటే ఓటీటీ, టెలివిజన్ లో ఈ చిత్రం కొంత ఎక్కువ సక్సెస్ ను సాధించింది. ఇప్పుడు తాజాగా హిందీలో కూడా ఓటీటీలో వచ్చేస్తోంది.