Weather: ఏపీలో పెరిగిన వడగాలుల‌ ప్రభావం

Weather Alert in ap

  • రాష్ట్రంలోని 574 మండలాల్లో ఉక్కపోత అధికం
  • ఈ రోజు 100 మండలాల్లో వడగాలుల‌ ప్రభావం 
  • ప‌లు జిల్లాల్లో సాధార‌ణం కంటే అధికంగా ఉష్ణోగ్ర‌త‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 574 మండలాల్లో ఉక్కపోత అధికంగా ఉంది. ఈ రోజు 100 మండలాల్లో వడగాలుల‌ ప్రభావం కూడా అధికంగా ఉంద‌ని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్ విజయవాడ, పల్నాడు, మన్యం, విజయనగరం జిల్లాల్లో అధిక మండలాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. 

నిన్న అనకాపల్లి జిల్లాలోని ఏడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. మిగిలిన జిల్లాల్లోని 40 మండలాల్లోని ప‌లు ప్రాంతాల్లోనూ వ‌డ‌గాలుల‌ ప్రభావం కనిపించింది. ప‌లు జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే అధికంగా న‌మోద‌వుతున్నాయి. నిన్న రేణిగుంటలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మ‌రోవైపు, రాయలసీమలోని ప‌లు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవ‌కాశ‌మూ ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. మే 4న దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వివ‌రించింది.

  • Loading...

More Telugu News