Andhra Pradesh: రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచార ఘటనపై స్పందించిన మంత్రి విడదల రజినీ

Vidadala Rajini Responds To Repalle Gang Rape Issue

  • నిందితులను వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
  • ఎస్పీ, వైద్యులతో మాట్లాడామని వెల్లడి
  • రేపల్లె రైల్వేస్టేషన్ ను పరిశీలించిన మంత్రి మేరుగ నాగార్జున

రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ స్పందించారు. ఘటన బాధాకరమన్నారు. సీఎం జగన్ దీనిపై స్పందించారని, నిందితులకు శిక్ష పడే దాకా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ, అధికారులతో మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. బాధితురాలి ఆరోగ్యం గురించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

కాగా, రేపల్లె రైల్వే స్టేషన్ ను మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని మూకలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం జగన్ తనను ఆదేశించారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

  • Loading...

More Telugu News