Chiranjeevi: చిరంజీవి హీరోగా రాధిక నిర్మాతగా కొత్త చిత్రం

Chiranjeevi will act under Radhika own banner
  • గతంలో విజయవంతమైన చిరు, రాధిక కాంబో
  • మరోసారి జతకలుస్తున్న పాత జోడీ
  • తమ బ్యానర్లో నటించేందుకు చిరు ఓకే చెప్పారన్న రాధిక
  • త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి
గతంలో చిరంజీవి, రాధిక కాంబోలో వచ్చిన అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి జత కలవనున్నారు. అయితే హీరోహీరోయిన్లుగా మాత్రం కాదు. చిరంజీవి హీరోగా నటించే కొత్త చిత్రానికి రాధిక నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాధిక స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. 

తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నాడని వివరించారు. తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాధిక పేర్కొంది.
Chiranjeevi
Radhika
Movie
Radan Media Works

More Telugu News