Mehul Choksi: మెహుల్ చోక్సీపై మరో కేసు... కోర్టులో నిలవదన్న గీతాంజలి లాయర్
- ఐఎఫ్‌సీఐపి మోసగించారని చోక్సీపై కొత్త కేసు
- ఇప్పటికే దేశం విడిచి పారిపోయిన చోక్సీ
- కొత్త కేసు ఊసుపోని కబుర్లకే పనికొస్తుందన్న చోక్సీ లాయర్
బ్యాంకుల నుంచి తీసుకున్న వేలాది కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి విదేశాలకు పారిపోయిన గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కేసు నమోదు చేసింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ)ని మోసగించినట్టుగా సీబీఐ అధికారులు చోక్సీతో పాటు ఆయన కంపెనీ గీతాంజలి జెమ్స్‌పైనా కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చోక్సీపై సీబీఐ నమోదు చేసిన కొత్త కేసు ఊసుపోని కబుర్లు చెప్పుకునేందుకు మాత్రమే పనికొస్తుందని, కోర్టులో మాత్రం నిలవదని ఆయన అన్నారు. తన క్లయింట్‌ను కిడ్నాప్ చేసేందుకు అంటిగ్వాకు కూడా వెళ్లేందుకు యత్నించిన సీబీఐ... ముందుగా తమలోని లోపాలపై దృష్టి పెట్టాలని సూచించారు.