Raj Thackeray: 14 ఏళ్ల నాటి కేసులో రాజ్ థాక‌రేకు నాన్ బెయిల‌బుల్ వారెంట్లు జారీ

non bailable notices to mns chief Raj Thackeray
  • 2008లో థాక‌రేపై విద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల కేసు
  • శిరాలా కోర్టు విచార‌ణ‌కు గైర్హాజ‌ర‌వుతున్న రాజ్‌
  • అరెస్ట్ చేసి త‌మ ముందు హాజ‌రు‌ప‌రచమన్న కోర్టు 
మ‌హారాష్ట్రకు చెందిన న‌వ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్‌) చీఫ్ రాజ్ థాక‌రేకు ఓ కోర్టు నుంచి నాన్ బెయిల‌బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 14 ఏళ్ల క్రితం న‌మోదైన ఓ కేసులో ఈ వారెంట్లు జారీ అయ్యాయి. ధాక‌రేతో పాటు ఎంఎన్ఎస్ కీల‌క నేత శిరీస్ పార్క‌ర్‌కు కూడా కోర్టు నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వీరిద్ద‌రినీ అరెస్ట్ చేసి త‌మ ముందు హాజరుప‌ర‌చాలని మ‌హారాష్ట్రలోని శాంగ్లీ జిల్లాలోని శిరాలా కోర్టు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

2008లో విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ రాజ్ థాక‌రే స‌హా శిరీస్ పార్క‌ర్‌ల‌పై కేసు న‌మోదయింది. ఈ కేసును శిరాలా కోర్టు విచారిస్తోంది. కేసు విచార‌ణ‌లో భాగంగా వాయిదాల‌కు హాజ‌రు కాని రాజ్ థాక‌రే, శిరీస్‌ల‌ను త‌దుప‌రి విచార‌ణ‌కు త‌మ ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని కోర్టు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Raj Thackeray
MNS
Maharashtra

More Telugu News