Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీగా పతనమైన సెన్సెక్స్!

Markets collapses after RBI hikes rates

  • కీలక వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ
  • తీవ్ర ప్రభావాన్ని చూపిన ఆర్బీఐ నిర్ణయం
  • 1,306 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఉదయం ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్లు చివరి వరకూ కోలుకోలేకపోయాయి. కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,306 పాయింట్లు కోల్పోయి 55,669కి చేరుకుంది. నిఫ్టీ 391 పాయింట్లు నష్టపోయి 16,677కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.75%), ఎన్టీపీసీ (0.73%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.07%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-4.29%), బజాజ్ ఫిన్ సర్వ్ (-4.18%), టైటాన్ (-4.11%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.98%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.34%).

  • Loading...

More Telugu News