Amaravati: సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతులకు నిరాశ

crda commissioner did not given appointment to amaravati farmers

  • రైతులను క‌లిసేందుకు క‌మిష‌న‌ర్ విముఖ‌త‌
  • గంట పాటు వేచి చూసినా రైతుల‌ను ప‌ట్టించుకోని వైనం
  • కార్యాల‌యంలో విన‌తి ప‌త్రం అంద‌జేసిన రైతులు

ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం వేలాది ఎక‌రాల భూములు ఇచ్చిన రాజ‌ధాని రైతుల‌కు మ‌రోమారు అవ‌మానం జ‌రిగింది. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన రాజ‌ధాని రైతుల‌కు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ వివేక్ యాద‌వ్ అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోగా... రైతుల‌ను గంట‌కు పైగా ప‌డిగాపులు ప‌డేలా చేశారు. అయినా క‌మిష‌న‌ర్ నుంచి పిలుపు రాక‌పోవ‌డంతో సీఆర్డీఏ కార్యాల‌యంలో విన‌తి ప‌త్రాన్ని అంద‌జేసి రైతులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. 

రాజ‌ధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములకు ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన కౌలు, ఎల్పీఎస్‌, రాజ‌ధాని ప‌రిధిలో నిర్మాణాల విష‌యంపై సీఆర్డీఏ క‌మిష‌న‌ర్‌కు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు బుధ‌వారం రాజ‌ధాని రైతులు సీఆర్డీఏ కమిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లారు. అయితే వీరికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌ని వివేక్ యాద‌వ్‌.. వారిని క‌లిసేందుకు విముఖ‌త వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో గంట‌కు పైగా వేచి చూసిన రైతులు.. చేసేది లేక క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో విన‌తి ప‌త్రం అంద‌జేసి వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News