America: తెలంగాణ యువకుడికి జాక్‌పాట్.. అమెజాన్‌లో రూ.1.20 కోట్ల ప్యాకేజీతో జాబ్

Telangana guy selected for amazon job in US with Rs Over One crore Salary
  • అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన అనీష్ కుమార్
  • అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్తా చాటిన అనీష్
  • టెక్నికల్ విభాగంలో టీం లీడర్‌గా ఎంపిక
తెలంగాణలోని వనపర్తి జిల్లా పాన్‌గల్ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పాన్‌గల్ మండలంలోని కేతేపల్లికి చెందిన అనీష్‌కుమార్‌రెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. 

అనీష్‌కుమార్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరాడు. గత నెలతో అతడి విద్యాభ్యాసం పూర్తయింది. తాజాగా, అక్కడ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై టెక్నికల్ విభాగంలో టీం లీడర్ ఉద్యోగానికి ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు వంగూరు బాలీశ్వర్‌రెడ్డి-వసంతలక్ష్మి తెలిపారు.
America
Amazon
Pangal
Vanaparthy
Telangana

More Telugu News