Junior NTR: వెడ్డింగ్ యానివర్సరీని కలిసి జరుపుకున్న జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. ఫొటోలు ఇవిగో!

Jr NTR KGF director Prashanth Neel share the same wedding date
  • తమ జీవిత భాగస్వాములతో కలిసి వేడుక జరుపుకున్న తారక్, ప్రశాంత్ నీల్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
  • ప్రశాంత్ దర్శకత్వంలో తారక్ 31వ సినిమా
ఒకరు 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్... మరొకరు 'కేజీఎఫ్2'తో దేశాన్ని ఊపేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరూ ఒక్కచోట కలిస్తే... అదీ కుటుంబాలతో కలిసి కనిపిస్తే... సినీ అభిమానులకు ఇంతకంటే కన్నులపండుగ ఉండదేమో. ఇప్పుడు అదే జరిగింది. నిన్న వీరి వెడ్డింగ్ యానివర్సరీల సందర్భంగా ఇరు కుటుంబాలు ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాత్ నీల్, ఆయన భార్య లిఖితలు వేడుక జరుపుకున్నారు. 

ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. 'సరికొత్త ప్రారంభం' అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరోవైపు తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. ఇది తారక్ కు 31వ సినిమా కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం ఒక రేంజ్ లో ఉంటుందని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని అభిమానులు అప్పుడే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.
Junior NTR
Prashanth Neel
Wedding Date
Families
Tollywood
Bollywood
Sandalwood

More Telugu News