Jr NTR: బరువు తగ్గే కసరత్తు మొదలు పెట్టనున్న జూనియర్ ఎన్టీఆర్

Jr NTR completes Hanuman Deeksha to start physical training for NTR 30
  • ముగిసిన 21 రోజుల హనుమాన్ దీక్ష
  • ఆర్ఆర్ఆర్ ప్రచారంలో భాగంగా బరువు పెరిగిన ఎన్టీఆర్
  • కొత్త పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మలుచుకోవడానికి వ్యాయామాలు
జూనియర్ ఎన్టీఆర్ 21 రోజుల హనుమాన్ దీక్షను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే తన 30వ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు. నూతన సినిమాలో తన పాత్రకు తగ్గ ఆకృతి కోసం జూనియర్ ఎన్టీఆర్ శారీరక కసరత్తులు ప్రారంభించనున్నాడు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. సినిమా ప్రచారంలో భాగంగా కాస్తంత ఒళ్లు చేశాడు. తన 30వ ప్రాజెక్టు కోసం ఇప్పుడు బరువు తగ్గించుకునే కసరత్తులు చేయనున్నట్టు సన్నిహిత వర్గాల కథనం. ప్రముఖ ఫిట్ నెస్ నిపుణుడి ఆధ్వర్యంలో ఆయన తర్ఫీదు పొందనున్నాడు.

ఎన్టీఆర్ 30వ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా కొరటాల శివ తెరకెక్కించనున్నారు. జూన్ లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. మాస్ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ భరితంగా ఈ సినిమా ఉంటుందని కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. రష్మికను తీసుకోవచ్చన్న ప్రచారం నడుస్తోంది.
Jr NTR
Hanuman Deeksha
NTR 30
physical training

More Telugu News