Gujarat Titans: మరో గెలుపు కోసం ముంబయి ఆరాటం... ఇవాళ్టి ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్
- టాస్ గెలిచిన గుజరాత్
- బౌలింగ్ ఎంచుకున్న వైనం
- పాయింట్ల పట్టికలో టాపర్ గా ఉన్న టైటాన్స్
- చిట్టచివరి స్థానంలో ముంబయి
ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ మరో మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు పటిష్ఠమైన గుజరాత్ టైటాన్స్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ టోర్నీలో అత్యంత దారుణంగా ఆడుతున్న జట్టేదయినా ఉందంటే అది ముంబయి జట్టే. 9 మ్యాచ్ లు ఆడిన ముంబయి 8 మ్యాచ్ లలో ఓడిపోయి, ఒక్క మ్యాచ్ లో నెగ్గింది. ఈ నేపథ్యంలో, పరువు నిలుపుకోవాలంటే మరికొన్ని విజయాలు సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఇవాళ్టి మ్యాచ్ ను తీవ్రంగా పరిగణిస్తోంది.
అయితే నేటి ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ టోర్నీలోనే అత్యంత కఠినమైన ప్రత్యర్థి. 10 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సమష్టి కృషినే నమ్ముకున్న గుజరాత్ ను ఏమాత్రం కలసికట్టుగా ఆడలేని ముంబయి ఏవిధంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇక ముంబయి జట్టులో ఒక మార్పు జరిగింది. యువ ఆటగాడు హృతిక్ షోకీన్ స్థానంలో మురుగన్ అశ్విన్ ను తీసుకున్నారు. ఇది వ్యూహాత్మక మార్పు అని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.