Marriage: పెళ్లిపీటలు ఎక్కుతున్న నయనతార.. పెళ్లి ఎప్పుడంటే..!

Nayanathara to marry Vignesh Sivan on June9
  • దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న నయనతార
  • జూన్ 9న తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం
  • దీనిపై అధికారికంగా స్పందించని ప్రేమ జంట
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో పడి చాలా కాలమే అవుతోంది. అప్పటి నుంచి నయన్ కు సంబంధించి సినిమా వార్తల కంటే ఆమె ప్రేమకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. విఘ్నేశ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

మరోవైపు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక సార్లు వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఇద్దరి పెళ్లి కూడా అయిపోయిందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నుదుటిన ఆమె సిందూరాన్ని ధరించడంతో... నయన్ పెళ్లి అయిపోయిందని జనాలు అప్పట్లో ఓ క్లారిటీకి వచ్చేశారు. 

ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. జూన్ 9న తిరుమలలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగానే ఇటీవల వీరు తిరుమలకు వచ్చారని... ఆ సందర్భంగా వివాహ వేదికను పరిశీలించారని చెపుతున్నారు. మరి ఈ విషయంపై నయన్, విఘ్నేశ్ లు స్పందించాల్సి ఉంది.
Marriage
Tollywood
Kollywood
Nayanthara

More Telugu News