Harish Rao: 'ఏం మాట్లాడాలి' అని అడిగిన రాహుల్ గారికి రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది: హరీశ్ రావు
- పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది
అన్న హరీశ్ రావు - పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ ను తెలంగాణ రైతులు నమ్ముతారా? అని ప్రశ్న
- నిన్నటిది రాహుల్ సంఘర్షణ సభ అని విమర్శ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై రాహుల్ చేసిన విమర్శలను హరీశ్ తిప్పికొట్టారు.
'రాహుల్ గాంధీ గారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్- చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ - రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు.
ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.