Jagga Reddy: రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు: జగ్గారెడ్డి

Prakash Raj is nothing infront of Rahul Gandhi says Jagga Reddy
  • కేసీఆర్ గురించి ప్రకాశ్ రాజ్ కు ఏం తెలుసన్న జగ్గారెడ్డి 
  • రాజ్యసభ పదవి వచ్చే చోటుకు ప్రకాశ్ రాజ్ చేరుకున్నారని సెటైర్ 
  • ఏదో ఒక రోజు కేసీఆర్ ను ప్రకాశ్ రాజ్ తిడతారన్న జగ్గారెడ్డి 
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తున్నది సీఎం కాదని... ప్రజల మాట వినని రాజు అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణను దార్శనికుడైన కేసీఆర్ పాలిస్తున్నారని... మీ మూర్ఖుల గుంపుతో మీరు ఏం ఆఫర్ చేస్తారో చెప్పాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడదని అన్నారు. 

ప్రకాశ్ రాజ్ కు సినిమాలు లేవని.. ఆయన గ్లామర్ అవుట్ అయిందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఈజీగా రాజ్యసభ పదవి వచ్చే చోటుకు ఆయన చేరారని అన్నారు. కేసీఆర్ గురించి ప్రకాశ్ రాజ్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. ఇదే ప్రకాశ్ రాజ్ ఏదో ఒక రోజు కేసీఆర్ ను తిడతారని అన్నారు. 

పంజాబ్ ను కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల పాటు పాలించిందని... ఒక్క ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన పని అయిపోనట్టు కాదని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ వరంగల్ సభ ప్రజల్లోకి పోకూడదనే ఉద్దేశంతో అన్ని వార్తాపత్రికల్లో ఫస్ట్ పేజ్ లో యాడ్స్ ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. రేపటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం చేస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర అన్న వాళ్లందరూ ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారని దుయ్యబట్టారు.
Jagga Reddy
Rahul Gandhi
congress
KCR
TRS
Prakash Raj
Tollywood

More Telugu News