Somu Veerraju: ఆ విషయం గురించి పవన్ కల్యాణ్ నే అడగండి: సోము వీర్రాజు

Ask Pawan Kalyan about this says Somu Veerraju
  • పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నామన్న వీర్రాజు 
  • జనంతో, జనసేనతో పొత్తులో ఉన్నామని వెల్లడి 
  • శ్రీశైలంలో చక్రపాణి రెడ్డి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తోందని వ్యాఖ్య 
పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. జనంతో, జనసేనతో తాము పొత్తులో ఉన్నామని అన్నారు. టీడీపీతో జనసేన కలుస్తుందో, లేదో అనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నే అడగాలని చెప్పారు. బీజేపీపై అనవసరపు వ్యాఖ్యలు చేసిన కాకినాడ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆటలను సాగనివ్వబోమని అన్నారు. 

శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తోందని చెప్పారు. అనంతపురం జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థినిపై హత్యాచారం చేసిన నిందితుడు సాదిక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Somu Veerraju
BJP
Janasena
Pawan Kalyan

More Telugu News