Jacqueline Fernandez: విదేశీ ప్రయాణం కోసం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Jacqueline Fernandez on ED radar moves court seeking nod to travel abroad

  • దుబాయిలో ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమం
  • ఈడీ పర్యవేక్షణలో వున్న జాక్వెలిన్   
  • 15 రోజుల ప్రయాణానికి అనుమతించాలని కోరిన నటి

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. 15 రోజుల పాటు విదేశీ ప్రయాణానికి అనుమతించాలని కోరారు. ప్రస్తుతం ఆమె ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పర్యవేక్షణలో ఉన్నారు. దోపిడీ కేసును ఎదుర్కొంటున్న లాబీయిస్ట్ సుకేశ్ చంద్రశేఖర్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండడం, సుకేశ్ నుంచి ఖరీదైన బహుమతులు స్వీకరించినట్టు ఈడీ విచారణలో ఆమె అంగీకరించడం తెలిసిందే.  

దీంతో జాక్వెలిన్ కు సంబంధించి రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో దుబాయిలో జరిగే ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా తనను అనుమతించాలని కోరుతూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్, నేపాల్ లోనూ పర్యటించాల్సి ఉందని కూడా ఆమె తెలిపింది. ఈడీ పర్యవేక్షణలో ఉన్నందున అనుమతి లేకుండా ఆమె విదేశీ ప్రయాణానికి వెళ్లడానికి లేదు. గత డిసెంబర్ లోనూ ఆమెను ముంబై ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించడం జరిగింది.

  • Loading...

More Telugu News