Electronic Goods: త్వరపడండి.. టీవీలు, ఫ్రిజ్ లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల ధరలు పెరగబోతున్నాయ్!

Electronic goods rates are going to be increased

  • 3 నుంచి 5 శాతం వరకు పెరగనున్న ధరలు
  • డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడమే కారణం
  • దిగుమతి చేసుకుంటున్న ముడివిభాగాల ధరలపై రూపాయి విలువ ప్రభావం

మధ్యతరగతి ప్రజలకు చేదు వార్త. టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల ధరలు పెరగబోతున్నాయి. వీటి ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ధరలు పెరగనున్నాయి. ఈ విషయం గురించి ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ, ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల వీటి ధరలను పెంచక తప్పడం లేదని తెలిపారు.

అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి విలువ మరింత పతనం కావడం వల్ల దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఈ కారణం వల్లే ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలను 3 నుంచి 5 శాతం వరకు పెంచాల్సి వస్తోందని తెలిపారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ, వివిధ ఉత్పత్తుల ధరలను జనవరిలోనే కొంత మేర పెంచామని... ఇప్పుడు మరోసారి 4 నుంచి 5 శాతం వరకు పెంచక తప్పడం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News