Sehwag: స్టేడియంలో జనరేటర్ ఉన్నది కేవలం లైట్ల కోసమేనా..?: సెహ్వాగ్ విమర్శలు

Is the generator only for stadium lights Sehwag lashes out at BCCI for DRS controversy during CSK vs MI match

  • బ్రాడ్ కాస్టింగ్, ఇతర సిస్టమ్స్ కోసం కాదా? అని సెహ్వాగ్ ప్రశ్న 
  • అలాంటప్పుడు మ్యాచ్ మొత్తానికి డీఆర్ఎస్ ఉండకూడదని వాదన 
  • దీనివల్ల చెన్నైకి నష్టం కలిగిందని వ్యాఖ్య 
  • ముందు ముంబై బ్యాట్ చేసినా నష్టపోయేదన్న సెహ్వాగ్ 

ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ సందర్భంగా కొంత సమయం పాటు డీఆర్ఎస్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంతో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై చేతిలో ఓటమి పాలై చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది. 

విద్యుత్ సమస్య కారణంగా డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అందుబాటులో లేకపోవడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఇది సీఎస్కేకు ప్రతికూలంగా మారినట్టు అభిప్రాయపడ్డాడు. డీఆర్ఎస్ అందుబాటులోకి వచ్చేసరికే చెన్నై కీలక వికెట్లను నష్టపోవడం జరిగింది. ‘‘పవర్ కట్ తో డీఆర్ఎస్ లేకపోవడం అన్నది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద లీగ్ లో జనరేటర్ వాడతారు. వారు ఉపయోగించే సాఫ్ట్ వేర్ ఏదైనా కానీ పవర్ బ్యాకప్ తో నడుస్తుంది. బీసీసీఐకి ఇది నిజంగా పెద్ద ప్రశ్న.

పవర్ పోతే ఎం జరుగుతుంది? మరి జనరేటర్ ఉన్నది స్టేడియంలో లైట్ల కోసమేనా? బ్రాడ్ కాస్టర్లు, వారి సిస్టమ్స్ కోసం కాదా? మ్యాచ్ జరుగుతున్నప్పుడు డీఆర్ఎస్ కూడా ఉపయోగంలో ఉండాలి కదా. లేదంటే మ్యాచ్ మొత్తానికి డీఆర్ఎస్ ను వినియోగించుకోకూడదు. ఎందుకంటే ఇది చెన్నైకి నష్టాన్ని కలిగించింది. తొలుత ముంబై బ్యాటింగ్ చేసినా వారికి కూడా నష్టం కలిగేది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News