Elon Musk: ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టిన ఎలాన్ మస్క్.. కుప్పకూలిన ట్విట్టర్ షేర్లు!

Elon Musk holds twitter deal temporarily

  • స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు పెండింగ్ లో ఉన్నాయన్న మస్క్
  • వీటి లెక్క తేల్చాలని వ్యాఖ్య
  • మస్క్ ప్రకటనతో 20 శాతం పతనమైన ట్విట్టర్ షేర్లు

ట్విట్టర్ కు అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న డీల్ ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అందుకే డీల్ ను హోల్డ్ లో పెడుతున్నానని ఆయన తెలిపారు. 

మొత్తం అకౌంట్లలో వీటి సంఖ్య 5 శాతం కంటే తక్కువగానే ఉంటుందని ట్విట్టర్ చెపుతోంది. అయితే ఈ లెక్క తేల్చాలని, పక్కా వివరాలను అందించాలని మస్క్ డిమాండ్ చేశారు. ఈ వివరాలు అందేంత వరకు డీల్ ను హోల్డ్ లో ఉంచుతున్నట్టు చెప్పారు. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ట్విట్టర్ షేర్ల విలువ ఏకంగా 20 శాతం పడిపోయింది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయాలనుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News