Virat Kohli: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు!

virat kohli creates rare record in ipl

  • ఐపీఎల్‌లో 6,500 పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ
  • నిన్నటి మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికి సింగిల్ తీసి రికార్డు నెలకొల్పిన విరాట్
  • ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 236 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ మాజీ సారథి

ఈసారి ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు వచ్చి చేరింది. గత రాత్రి పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సింగిల్ తీసిన కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6,500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

నిన్నటి మ్యాచ్‌లో మరోమారు విఫలమైన ఈ మాజీ సారథి 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 236 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 220 మ్యాచ్‌లు ఆడి 16.22 సగటుతో 6,519 పరుగులు చేశాడు. 

ఇందులో 5 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6,186) ఉన్నాడు. ఐపీఎల్‌లో ఆరువేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాళ్లు ఇప్పటి వరకు వీరిద్దరే. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (5,876), రోహిత్ శర్మ (5,829), సురేశ్ రైనా (5,528) ఉన్నారు.

  • Loading...

More Telugu News