Sri Lanka: భారత్‌లోనూ అప్పుడు శ్రీలంక పరిస్థితే: ప్రతిపక్ష ఎంపీ హర్ష డి సిల్వ

Sri Lankan situation is similar to that of Indias 1991 economic crisis says opposition MP Harsha de Silva

  • ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
  • 1991లో భారత్ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులే ఇప్పుడు శ్రీలంకలోనూ ఉన్నాయని వ్యాఖ్య
  • పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే తప్ప బయటపడడం సాధ్యం కాదన్న హర్ష డి సిల్వ

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితి ఇంకా సంక్లిష్టంగానే ఉంది. కష్టాల నుంచి బయటపడే మార్గం లేక అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ ప్రతిపక్ష సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పార్టీ ఎంపీ హర్ష డి సిల్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1991లో భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభంలానే ప్రస్తుతం తమ దేశ పరిస్థితి ఉందన్నారు. దేశం మళ్లీ కోలుకుంటుందని, అయితే అందుకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు అధ్యక్షుడు ఓ ప్లాట్‌ఫాం రూపొందించాలని హర్ష డి సిల్వ కోరారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి జఠిలంగా ఉందని, మరింత విపత్తులోకి జారిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News