Wriddhiman Saha: వృద్ధిమాన్ సాహా మా జట్టులో ఉండడం గొప్ప విషయం: గ్యారీ కీర్ స్టెన్

Very impressed with Wriddhiman Saha Gujarat Titans mentor Gary Kirsten heaps praise on dropped India keeper

  • అతడు అసలైన ప్రొఫెషనల్ అన్న కీర్ స్టెన్ 
  • ఆటను బాగా అర్థం చేసుకుంటాడని కితాబు 
  • పవర్ ప్లేలో గొప్పగా ఆడతాడని ప్రశంస 
  • అతడికి ఏమీ నేర్పించక్కర్లేదన్న జీటీ కోచ్

గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఓపెనర్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆటతీరును ఆ జట్టు కోచ్ గ్యారీ కీర్ స్టెన్ మెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2022తో ఈ కొత్త జట్టు తన జర్నీని ప్రారంభించింది. అన్ని జట్లను బలంగా ఢీకొడుతూ, చక్కని విజయాలతో పాయింట్ల పట్టికలో నంబర్ 1గా కొనసాగుతోంది. దీని వెనుక జట్టులో ఆటగాళ్ల సెలక్షన్, కోచ్ పాత్ర ఎంతో ఉంటాయి.

ఈ క్రమంలో జట్టు కోచ్ కీర్ స్టెన్ మాట్లాడుతూ.. వృద్ధిమాన్ సాహా పనితీరు మెప్పించేలా ఉందన్నారు. జట్టులో అతడ్ని కలిగి ఉండడం గొప్ప విషయంగా అభివర్ణించారు. అసలైన ప్రొఫెషనల్ అని ప్రశంసించారు. ఐపీఎల్ సహా అన్ని రకాల క్రికెట్ లో సాహా మంచి అనుభవం సంపాదించాడని చెప్పుకొచ్చారు.

దాదాపు అధిక శాతం మ్యాచ్ ల్లో సాహా ఓపెనర్ గా వచ్చి నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కీర్ స్టెన్ ఇలా ప్రశంసించడం గమనార్హం. ‘‘అతడు గేమ్ ను అర్థం చేసుకుని పవర్ ప్లేలో చక్కగా ఆడుతున్నాడు. అతడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఒక్కటి కూడా లేదు. పవర్ ప్లేలో ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఆటగాళ్లకు తమ బలాలు, సామర్థ్యాలు చూపించడమే కీలకం. టీ20లో అతడు ఓ గొప్ప ప్లేయర్’’ అని కీర్ స్టెన్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడైన కీర్ స్టెన్ గతంలో భారత జట్టుకు సైతం కోచ్ సేవలు అందించారు.

  • Loading...

More Telugu News