Sensex: ఆరు రోజుల నష్టాలకు ముగింపు పలికిన మార్కెట్లు
- 180 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 60 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3 శాతం వరకు లాభపడిన ఎన్టీపీసీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 52,973కి పెరిగింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 15,842 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.95%), బజాజ్ ఫైనాన్స్ (2.37%), మారుతి (2.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.27%), హెచ్డీఎఫ్సీ (1.96%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-3.01%), ఏసియన్ పెయింట్స్ (-2.15%), ఐటీసీ (-1.78%), టీసీఎస్ (-1.08%), డాక్టర్ రెడ్డీస్ (-1.02%).