McDonald's: రష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డొనాల్డ్స్
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
- రష్యా నుంచి నిష్క్రమిస్తున్నామన్న మెక్ డొనాల్డ్స్
- 30 ఏళ్ల బంధానికి ముగింపు అని ప్రకటన
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై ప్రపంచ దేశాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా వరుస షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే రష్యా తీరుకు నిరసనగా ఆ దేశంలో కార్యకలాపాలను రద్దు చేసుకున్న పలు సంస్థలు రష్యాకు గుడ్ బై చెప్పేశాయి. తాజాగా ఈ జాబితాలో అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ కూడా చేరిపోయింది.
రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు మెక్ డొనాల్డ్స్ ప్రకటించింది. 30 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు మెక్ డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సదరు సంస్థ నుంచి కీలక ప్రకటన విడుదలైంది.