TDP: కేంద్ర మంత్రులకు టీడీపీ ఎంపీల లేఖలు... సీబీఐ బృందానికి భద్రత కల్పించాలని వినతి
- అమిత్ షా, జితేంద్ర సింగ్‌లకు ఎంపీల లేఖలు
- నారాయణ అరెస్ట్‌లో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న ఎంపీలు
- ఈ వ్యవహారంలో చిత్తూరు ఎస్పీ పాత్ర అనుమానాస్పదమని ఆరోపణ
- సీబీఐ బృందానికి బెదిరింపుల అంశాన్ని ప్రస్తావించిన టీడీపీ ఎంపీలు
టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. ఏపీలో పలు కేసుల దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందాలకు భద్రత కల్పించాలని ఆ లేఖల్లో కేంద్ర మంత్రులను టీడీపీ ఎంపీలు కోరారు.
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆ లేఖల్లో టీడీపీ ఎంపీలు ప్రస్తావించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందానికి బెదిరింపుల అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌లో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న టీడీపీ ఎంపీలు... ఈ వ్యవహారంలో చిత్తూరు జిల్లా ఎస్పీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు.