Kangana Ranaut: నా ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కి లేదు: కంగనా రనౌత్

No Bollywood star has right to come to my home says Kangana Ranaut
  • తనతో నటించేందుకు బాలీవుడ్ స్టార్లు ఇష్టపడరన్న కంగన 
  • తనతో నటించేవారిని బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని వ్యాఖ్య 
  • అర్జున్ రాంపాల్ తనతో నటించడం నిజంగా గ్రేట్ అని కితాబు 
బాలీవుడ్ స్టార్ హీరోలపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మండిపడింది. బాలీవుడ్ స్టార్లు ఎవరూ తనతో నటించేందుకు ఇష్టపడరని... ఎందుకంటే తానంటే వారికి భయమని చెప్పింది. తనతో పని చేసిన వారిని కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని తెలిపింది. అయినప్పటికీ తనతో కలిసి అర్జున్ రాంపాల్ నటించాడంటే నిజంగా గ్రేట్ అని కితాబునిచ్చింది. 

తన ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ బీటౌన్ సెలబ్రిటీకి కానీ లేదని కంగన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనను వీరెవరైనా బయట కలిస్తే పర్వాలేదని... తాను మాత్రం వీరెవరినీ తన ఇంటికి ఆహ్వానించనని చెప్పింది. 

కంగన తాజా చిత్రం 'ధాకడ్' ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఆమె స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని రీతిలో యాక్షన్ సీన్లలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసింది. కంగన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్ లో చర్చనీయాంశంగా మారాయి.
Kangana Ranaut
Bollywood
Star Heros

More Telugu News