TDP: ఏపీలో రాజ్య‌స‌భ‌కు అర్హులైన వారే లేరా?: చంద్ర‌బాబు

chandrababu comments on ysrcp rajyasabha candidates selection

  • క‌డ‌ప‌లో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చంద్ర‌బాబు
  • వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై విమర్శలు 

ఏపీ కోటాలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్య‌స‌భ స్థానాల‌కు వైసీపీ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితాపై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. బుధ‌వారం క‌డ‌ప‌లో పార్టీ శ్రేణులు నిర్వ‌హించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు... రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక ప‌ట్ల వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీలో రాజ్య‌స‌భ‌కు అర్హులైన వారే లేరా? అంటూ ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు...ఏపీలో రాజ్య‌స‌భ‌లో రాణించే స‌త్తా క‌లిగిన వారు లేనట్టు, నాయ‌కులే లేన‌ట్లు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల నేత‌లు లేన‌ట్లు... జ‌గ‌న్ ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారిని ఎంపిక చేశార‌ని విమర్శించారు. త‌న‌ను ప్రశ్నించే వారే లేర‌న్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఈ త‌ర‌హా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌న్న‌ద్ధం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News