Congress: కిర‌ణ్ కుమార్ రెడ్డి సేవ‌లు కాంగ్రెస్‌కు అవ‌స‌రం: ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్‌

congress ap incharge mayyappan comnments on kiran kumar reddy delhi tour
  • ఢిల్లీ టూర్‌లో కిర‌ణ్ కుమార్ రెడ్డి
  • అదిష్ఠానం పిలుపు మేరకే వెళ్లారంటూ వార్త‌లు
  • కిర‌ణ్ కుమార్ రెడ్డి సేవ‌లు అవ‌స‌ర‌మ‌న్న మ‌య్య‌ప్ప‌న్‌
ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌ల అవ‌స‌రం కాంగ్రెస్ పార్టీకి చాలా అవ‌స‌ర‌మ‌ని ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేర‌కే కిర‌ణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వ‌చ్చి ఉంటార‌న్న మ‌య్య‌ప్ప‌న్‌.. కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఏ బాధ్య‌త అప్ప‌గించాల‌న్న విష‌యంపై పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. పార్టీ వ‌ల్ల ప‌దవి, అధికారం, ప్ర‌యోజ‌నాలు పొందిన వారు పార్టీకి తిరిగి సేవ‌లు చేయాల్సిన అవ‌స‌రం వచ్చింద‌న్న ఆయ‌న‌... ఆ విష‌యాన్ని ఉద‌య్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన చింత‌న్ శిబిర్‌లో చెప్పామ‌ని తెలిపారు.

ఇక కిర‌ణ్ కుమార్ రెడ్డి తిరిగి యాక్టివేట్ కావాల్సిన అవ‌స‌రాన్ని త‌న‌తో పాటు పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ ఇప్ప‌టికే ఆయ‌న‌కు ప‌లుమార్లు సూచించార‌ని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అయినా, లేదంటే జాతీయ స్థాయిలో అయినా పార్టీకి సేవ‌లందించాల‌ని ఆయ‌న‌ను కోరామ‌ని తెలిపారు. ఆ దిశ‌గా ఆలోచించిన మీద‌టే కిర‌ణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్‌కు వ‌చ్చి ఉంటార‌న్న మ‌య్య‌ప్ప‌న్‌.. ఇది ఆహ్వానించ‌ద‌గిన విష‌యమేన‌ని తెలిపారు.
Congress
Nallari KIran Kumar reddy
APCC

More Telugu News