Nikhat Zareen: లాస్ట్ పంచ్ మ‌న‌దే!... వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిఖ‌త్ జ‌రీన్‌!

nikhat zareen wins gold in womens world boxing championship
  • కాసేప‌టి క్రితం ముగిసిన ఫైన‌ల్‌
  • థాయ్‌ల్యాండ్ క్రీడాకారిణిని మ‌ట్టి క‌రిపించిన హైద‌రాబాదీ బాక్సర్‌
  • స్వ‌ర్ణ ప‌త‌కంతో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిఖ‌త్ జ‌రీన్
హైద‌రాబాదీ యువ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. గురువారం రాత్రి ముగిసిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నిఖ‌త్ విజ‌యం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖ‌త్ వుమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచింది. 
.మ‌హిళ‌ల ప్రపంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా 52 కిలోల విభాగంలో స‌త్తా చాటుతూ సాగిన నిఖ‌త్‌... త‌న జోరును ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ కొన‌సాగించింది. ఫైన‌ల్‌లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపించిన నిఖ‌త్ లాస్ట్ పంచ్ కూడా త‌న‌దేన‌న్న‌ట్లుగా చెల‌రేగింది. జిట్ పాంగ్ ను ఏకంగా 5-0 తేడాతో చిత్తు చేసింది. ఫైన‌ల్ మ్మాచ్‌లో విజ‌యం సాధించిన నిఖ‌త్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించి 52 కిలోల విభాగంలో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా చ‌రిత్ర సృష్టించింది.
Nikhat Zareen
World Boxing Championships
Hyderabad
Telangana

More Telugu News