Omicron: దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఒమిక్రాన్ బీఏ.4’.. మరికొన్ని నగరాలకూ పాకే అవకాశం ఉందని హెచ్చరిక

Indias first case of Omicron subvariant BA4 detected in Hyderabad
  • ఈ నెల 9న నమోదైన కేసు
  • ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదంటున్న నిపుణులు
  • ఇప్పటికే కరోనా సోకిన వారికి, రెండు డోసులు వేయించుకున్న వారికి సోకుతున్న వైనం
  • ఆసుపత్రిలో చేరేంత ప్రమాదం ఉండదని స్పష్టీకరణ
  • వ్యాప్తి అధికంగా ఉంటుందన్న డబ్ల్యూహెచ్ఓ
కరోనా కథ ముగిసిందనుకుంటున్న వేళ ఆందోళన కలిగించే మరో విషయం వెలుగులోకి వచ్చింది. వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్  సబ్ వేరియంట్ అయిన ‘బీఎ.4’ తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్‌తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. 

ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. కరోనా బారినపడిన వారికి, ఇప్పటికే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే, ఇది ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు కానీ, వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు.

భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఎ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరిగినా ఉద్ధృతి మాత్రం తక్కువగానే ఉంటుందని అంటున్నారు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు దాదాపు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది.
Omicron
BA.4
Hyderabad
WHO
ICMR

More Telugu News