F3: 'ఎఫ్3' చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

Censor board certified clean U for F3 movie
  • వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్3'
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా ఎంటర్టయినర్
  • ఈ నెల 27న రిలీజ్.. సెన్సార్ పూర్తి
  • మే 21న ప్రీ రిలీజ్ ఈవెంట్
విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన 'ఎఫ్3' చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. సినిమా రన్ టైమ్ 2 గంటల 28 నిమిషాలు. తమ చిత్రానికి సెన్సార్ బోర్డు U సర్టిఫికెట్ ఇవ్వడం పట్ల చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులందరూ కలిసి చూడగలిగే స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం 'ఎఫ్3' అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. సినిమా మొత్తం నవ్వులే నవ్వులు అని వెల్లడించింది. 

సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా నటించిన ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (మే 21) హైదరాబాదు శిల్పకళావేదికలో జరగనుంది.
.
F3
U
Censor Board
Venkatesh
Varun Tej
Anil Ravipudi
Tollywood

More Telugu News