Gorantla Butchaiah Chowdary: పిల్లలకు శిక్షణ ఇప్పించి న్యూయార్క్ పంపించిన ఘనత టీడీపీది: గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah Chowdary comments on CM Jagan
  • నిన్న  సీఎం జగన్ తో బెండపూడి విద్యార్థుల భేటీ
  • ఇంగ్లీషులో అదరగొట్టిన చిన్నారులు
  • ముగ్ధుడైన సీఎం జగన్
  • స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఏపీ సీఎం జగన్ తో బెండపూడి గవర్నమెంట్ హైస్కూల్ విద్యార్థులు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పిల్లలు చక్కగా ఆంగ్లంలో మాట్లాడడం పట్ల సీఎం జగన్ సంతోషంతో పొంగిపోవడాన్ని ఆ వీడియోల్లో చూడొచ్చు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటే ఇదే అంటూ విమర్శించారు. టీడీపీ హయాంలోనే పిల్లల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిల్లలకు నైపుణ్యాభివృద్ధి, భావవ్యక్తీకరణ మెళకువలకు సంబంధించి శిక్షణ ఇప్పించి, వారిని న్యూయార్క్ పంపించిన ఘనత టీడీపీదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉద్ఘాటించారు. ఇప్పుడు సీఎం గారు కొత్తగా తానే ఏదో ఇంగ్లీష్ ను సృష్టించినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

అంతేకాదు, గతంలో టీడీపీ ప్రభుత్వం పిల్లలను అమెరికా పంపించినప్పటి వీడియోను కూడా పంచుకున్నారు. ఆ పిల్లలు ఏకంగా రోబోలనే తయారు చేయడం విశేషం. తాము రూపొందించిన రోబోలను న్యూయార్క్ ల ప్రదర్శించేందుకు వారు నాడు అమెరికా తరలి వెళ్లారు.
Gorantla Butchaiah Chowdary
TDP
Students
New York
USA
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News